

ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అమెరికాలో, ముఖ్యంగా ఓహియో మరియు టెక్సాస్‌లోని డల్లాస్ ప్రాంతాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థినులు ధనిక ఎన్ఆర్ఐలను “హనీ ట్రాప్” చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
వీడియోలో వారు ఇళ్లలో హెల్పర్లుగా చేరి డబ్బులు, నగలు దొంగిలించడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం, పురుషులను బ్లాక్మెయిల్ చేయడం, ఆ డబ్బులతో ఇళ్లు కొనుగోలు చేయడం వంటి విచిత్రమైన వాదనలు చేశారు.
కానీ ఈ ఆరోపణలను ఆధారపరిచే ఏ పోలీస్ కేసు, ఎఫ్ఐఆర్, లేదా అధికారిక డాక్యుమెంట్ కూడా లేవు.
ఎన్ఆర్ఐలు ఈ వీడియోను పూర్తిగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చేసిన అబద్ధ కథగా కొట్టిపారేశారు:
ఒక NRI మాట్లాడుతూ, “వీడియో క్రియేటర్‌కు వ్యూస్ కావాలి. నిర్ధారణ లేకుండా రాష్ట్రాల పేర్లు చెప్పింది. దొంగిలించిన డబ్బులతో ఇళ్లు కొనడం వంటివి పూర్తిగా అవాస్తవం.”
మరొకరు, “ఇలాంటి హనీ ట్రాప్ కేసులు అమెరికాలో రిజిస్టర్ కాకుండా ఉండడం అసాధ్యం. ఏదైనా జరిగితే వెంటనే పోలీసులను సంప్రదిస్తారు.” అన్నారు.
ఇంకొకరు, “ఇమిగ్రేషన్ రూల్స్ మారే ముందు విద్యార్థినులు హెల్పర్‌గా పనిచేసే సందర్భాలు ఉన్నాయి. వారంతా మంచి ప్రవర్తనతో ఉన్నారు. ఈ వీడియో కష్టపడి చదువుకుంటున్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంది.” అన్నారు.
ఒక NRI మహిళ స్పష్టం చేస్తూ, “హనీ ట్రాప్ జరిగితే అందులో పురుషుడి బాధ్యత కూడా ఉంటుంది. ఆధారాలు లేకుండా మహిళల్ని తప్పుబట్టడం సరైంది కాదు.” అన్నారు.
కొంతమంది NRIs సాధారణ అభిప్రాయం వ్యక్తం చేస్తూ, “ఎక్కడైనా అరుదుగా కేసులు ఉండవచ్చు. కానీ ఈ వీడియో పూర్తిగా జనరలైజ్ చేసి, అతిశయోక్తిగా చెప్పడంతో నమ్మశక్యం కాదు.” అన్నారు.
ఎటువంటి ఆధారం లేదు. ఎటువంటి కేసులు నమోదు కాలేదు.
వైరల్ వీడియోలోని ఆరోపణలు అసత్యం, అతిశయోక్తి, సాక్ష్యం లేని కథనంగా తేలాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!