

తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి విద్యా విధానాలపై సుదీర్ఘ నివేదికను సమర్పించింది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు నేతృత్వంలో రూపొందించిన ఈ నివేదికలో చట్టబద్ధత అవసరమైన అంశాలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన విధానాలపై సూచనలు ఉన్నాయి.
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఇతర సభ్యులు అమెరికా, వియత్నాం, మలేషియా వంటి దేశాల్లో స్వయంగా పర్యటించడం, పలు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ విద్యా విధానాల అనుభవాలు పరిశీలించడం ద్వారా తయారు చేసిన నివేదికను ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి సిఫారసులపై సూచనలు ఇచ్చారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి, డాక్టర్ కె. కేశవరావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీలు, విద్యా కమిషన్ సభ్యులు మరియు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!