

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 26వ తేదీన విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. గతంలో జారీ చేసిన సమన్లకు ఆయన హాజరుకాకపోవడంతో రెండోసారి నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ కేసు ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో కీలక దశకు చేరుకుంది.
ఈ విచారణలో భాగంగా అనిల్ అంబానీ సతీమణి టీనా అంబానీని కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఆమె కూడా గతంలో విచారణకు హాజరుకాలేదని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. వరుసగా విచారణకు గైర్హాజరు కావడం నేపథ్యంలో ఈనెల 26న అనిల్ అంబానీ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారగా, భవిష్యత్తులో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!