
గాసిప్స్
.jpg&w=3840&q=75)
ఈశాన్య భారత రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. అదే సమయంలో త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లాలో 3.9 తీవ్రతతో భూమి కంపించింది.
అధికారుల సమాచారం ప్రకారం, అస్సాంలోని మోరిగావ్ కు సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం పొరుగున ఉన్న మేఘాలయ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా కనిపించినట్లు తెలుస్తోంది.
ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. పరిస్థితిని సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!