

సైబరాబాద్ పరిధిలో వీకెండ్ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో మొత్తం 377 మంది నిబంధనలు ఉల్లంఘించిన వారిని పట్టుకున్నారు. వీరిలో రెండు చక్రాల వాహనాలు 300, మూడు చక్రాల వాహనాలు 17, నాలుగు చక్రాల వాహనాలు 58, హెవీ వాహనాలు 2గా నమోదయ్యాయి. రోడ్డు భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ ఆధారంగా చూస్తే, 317 మందికి 35 mg/100 ml నుంచి 200 mg/100 ml వరకు BAC నమోదైంది. మరో 39 మందికి 201 mg/100 ml నుంచి 300 mg/100 ml వరకు, 21 మందికి అత్యధికంగా 301 mg/100 ml నుంచి 550 mg/100 ml వరకు నమోదైంది. ఈ కేసులన్నింటినీ గౌరవ న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే, భారతీయ న్యాయ సంహిత–2023 లోని సెక్షన్ 105 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!