
గాసిప్స్

డాక్టర్ నమ్రతపై సరోగసీ ముసుగులో కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలు చేపట్టింది. నమ్రతతో పాటు ఆమె కుమారుడిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. సంతానం పేరుతో అమాయకులను మభ్యపెట్టి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని పరిశీలిస్తున్న ఈడీ, లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎనిమిది బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి, సరోగసీ పేరిట చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్టు అనుమానాలతో విచారణను విస్తరించారు. కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!