
క్రీడలు

మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డీజీసీఏ కీలక సూచనలు జారీ చేసింది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి వెళ్లే కొన్ని విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
దుబాయ్‌లోని అన్ని విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడినట్టు ప్రకటించడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు రావొద్దని అధికారులు సూచించారు. దుబాయ్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే కనెక్టింగ్ విమానాలపై కూడా ప్రభావం పడుతోంది. దీని ప్రభావం భారత విమానాశ్రయాలపైనా కనిపిస్తోంది.
ఢిల్లీ ఎయిర్‌పోర్టు సహా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడే అవకాశముండటంతో, ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని డీజీసీఏ సూచించింది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!