

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ బంగ్లాదేశ్ ఆశించిన ప్రయోజనాలు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం అమెరికా–బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్‌పై విధిస్తున్న టారిఫ్‌లు 20 శాతం నుంచి కేవలం 19 శాతానికి మాత్రమే తగ్గాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రీర్, బంగ్లాదేశ్ ప్రతినిధి షేక్ బషీరుద్దీన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేయగా, ఈ విషయాన్ని శ్వేతసౌధం ధ్రువీకరించింది. టెక్స్టైల్స్, అప్పెరల్స్ రంగంలో కొన్ని మినహాయింపులు పొందేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని తెలిపినా, అమెరికాలో తయారైన కాటన్‌ను వినియోగించేందుకు బంగ్లాదేశ్ అంగీకరించినట్లు సలహాదారు మహమ్మద్ యూనస్ వెల్లడించారు. గతంలో ట్రంప్ పాలనలో 37 శాతం వరకు ఉన్న టారిఫ్‌లు, ఆ తర్వాత 20 శాతానికి తగ్గి, ఇప్పుడు 19 శాతానికి స్థిరపడ్డాయి.
ఇదే సమయంలో భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం 18 శాతం టారిఫ్‌ల వద్ద కుదరడంతో, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఆందోళన మొదలైంది. ఎన్నికల వేళ భారత్ కంటే తక్కువ టారిఫ్‌లతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న లక్ష్యం నెరవేరకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, మెడికల్ పరికరాలు, ఆటో పార్ట్స్, ఇంధన ఉత్పత్తులకు బంగ్లాదేశ్ మార్కెట్‌ను తెరవడానికి అంగీకరించింది. అయినప్పటికీ, కేవలం స్వల్ప టారిఫ్ తగ్గుదలతో ఈ ఒప్పందం ఎంతవరకు ప్రయోజనకరమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!