
గాసిప్స్

దేశ రాజధాని ఢిల్లీ లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గింది. దీని ప్రభావంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం పలువురు ప్రయాణికులు ఆలస్యాలతో ఇబ్బందులు ఎదుర్కొనగా, అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా విమానాశ్రయంలో అప్రమత్తత చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఈ నెల 15న ఢిల్లీలోని సఫ్టరాంగ్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 2.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. గత మూడు సంవత్సరాల్లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతకుముందు 2023 జనవరి 18న 2.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు గుర్తు చేశారు. చలి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!