
గాసిప్స్

డెలివరీ, ఈ–కామర్స్ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికులు ఈ నెల 31న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. దిగజారుతున్న పని పరిస్థితులు, తగ్గుతున్న ఆదాయాలు, భద్రతా లోపాలు, సామాజిక భద్రత లేకపోవడం వంటి సమస్యలపై నిరసనగా ఈ సమ్మె చేపడుతున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి యాప్స్‌కు పనిచేసే డెలివరీ సిబ్బంది సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
గిగ్ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ కవరేజీ, పెన్షన్ బెనిఫిట్స్ వంటి మౌలిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 9 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ సమ్మెతో పలు నగరాల్లో డెలివరీ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని కార్మిక సంఘాలు వెల్లడించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!