
గాసిప్స్

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గు మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఇటీవలి రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో సోనియా గాంధీ ఆరోగ్యం దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గతంలోనూ ఆమె శ్వాసకోశ సమస్యలతో బాధపడిన నేపథ్యంలో, ప్రస్తుత గాలి నాణ్యత ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు భావిస్తున్నారు. సీనియర్ పల్మోనాలజిస్ట్ నేతృత్వంలోని వైద్య బృందం చికిత్స అందిస్తోందని, ఆందోళన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
.png&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!