
టెక్నాలజీ

చెక్ బౌన్స్ కేసులో మరికొంత సమయం ఇవ్వాలని బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన తిహాడ్ జైలులో లొంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని, తనకు సహాయం చేసే వారు లేరని జైలు అధికారులతో ఆయన వెల్లడించారు. సినీ పరిశ్రమలో ఎవరినీ సహాయం అడగకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అప్పు తిరిగి చెల్లించకపోవడం, చెక్కులు బౌన్స్ కావడం నేపథ్యంలో కేసు నమోదు చేసింది. 2018 లో మెజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించగా, 2019 లో సెషన్స్ కోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. 2024 లో హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చి రాజీ సూచించినప్పటికీ హామీలను నెరవేర్చకపోవడంతో తాజాగా తుది ఆదేశాలు జారీ చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!