

రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో మొత్తం ₹2,01,023 కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో విశాఖలో రిలయన్స్ సంస్థ ₹1,08,010 కోట్లతో డేటా సెంటర్, సత్యసాయి జిల్లాలో ₹51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో అదానీ ₹12,000 కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్, తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ₹2,500 కోట్లతో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 ఉద్యోగాలు లభించనున్నాయి.
సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారీ పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” కార్యక్రమంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. పరిశ్రమల ప్రాంతాల్లో గ్యాస్ పైప్‌లైన్ సదుపాయం కల్పించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉద్యాన, వాణిజ్య పంటలకు విలువ జోడింపు ద్వారా రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!