

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్‌లో జరుగుతున్న భూకబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వేల కోట్ల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియా ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ వందలాది మంది రైతులు ఆయనను కలిశారు. కబ్జాదారుల దాడుల్లో ధ్వంసమైన బోర్లు, గాయాల ఫొటోలు, వీడియోలను చూపించి తమ గోసను వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన హరీష్ రావు వెంటనే అధికారులతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ఈ భూములను రక్షించేందుకు హైకోర్టు వరకు పోరాడిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ పెద్దల అండతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా? పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలను ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!