

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో 82 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో ఆళ్వార్ ట్యాంక్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు టాయిలెట్స్ నిర్మాణానికి రూ.4.54 కోట్లు, గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు పైప్‌లైన్ పనులకు రూ.6 కోట్లు మంజూరు చేశారు. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో కొత్త మండపాల నిర్మాణానికి రూ.36.9 కోట్లు, వరాహస్వామి విశ్రాంతి భవనం ఆధునీకరణకు రూ.3.6 కోట్లు కేటాయించారు.
అలాగే రూ.44.2 కోట్లతో పట్టువస్త్రాల కొనుగోలు, కోయంబత్తూరులో టీటీడీ పేరిట ఉన్న 19.49 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం, ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐడీ కార్డులు, లడ్డూ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు. జూలై 15 వరకు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించారు. అలిపిరి వద్ద రోడ్డు విస్తరణ, బస్ బే నిర్మాణం, టౌన్‌షిప్ అభివృద్ధిపై చర్చలు జరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!