
రాజకీయాలు

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ కల్కి 2898 AD సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ను తొలి భాగం కంటే మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన తాజా నైట్ షూట్ షెడ్యూల్‌లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొనాల్సి ఉన్నట్లు సమాచారం.
అయితే కీలక పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి అనారోగ్యానికి గురికావడంతో షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ షూటింగ్ ప్రారంభించాలని నాగ్ అశ్విన్ అండ్ టీమ్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌ను మే మధ్యలో తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభాస్ ‘స్పిరిట్’, ‘ఫౌజి’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!