.png&w=3840&q=75)

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పై జాతీయ జెండాను అవమానించినట్లు ఆరోపిస్తూ అహ్మదాబాద్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు కావడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ విజయోత్సవాల సమయంలో సంభవించింది. వాజిద్ ఖాన్ అనే న్యాయవాది హార్దిక్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పూణే పోలీసులు వద్ద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు విషయాన్ని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు ధృవీకరించారు.
గత ఆదివారం న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు తర్వాత సంబరాల్లో భాగంగా హార్దిక్ త్రివర్ణ జెండాను తన శరీరానికి చుట్టుకుని మైదానంలో అసభ్యకరంగా ప్రవర్తించారని ఖాన్ ఫిర్యాదులో తెలిపారు. ఈ చర్య చట్టవిరుద్ధమని, జాతీయ జెండా గౌరవాన్ని పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఖాన్ అభిప్రాయపడ్డారు. అతను హార్దిక్ పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో అభ్యర్థించారు.










.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!