
సినిమాలు

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన “ధురంధర్ 2” సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ భారీ విజయంపై ఆయన భార్య, నటి దీపికా పదుకొణె ఇప్పటివరకు స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ఎందుకు సినిమా గురించి మాట్లాడటం లేదని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.
ఈ ట్రోల్స్‌కు దీపిక తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తాను అందరికంటే ముందే ఈ సినిమాను చూసానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోయినంత మాత్రాన మద్దతు ఇవ్వలేదని అనుకోవడం తప్పని స్పష్టం చేశారు. వ్యంగ్యంగా “ఇప్పుడు ఎవరు ఎవరిని విమర్శించాలి?” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ రూ.1000 కోట్ల మార్క్ దాటుతూ భారీ విజయాన్ని కొనసాగిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!