
గాసిప్స్

హైదరాబాద్లో బయటపడిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. చిన్నారులను అక్రమంగా విక్రయించేందుకు ఒక పెద్ద ముఠా విస్తృత నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా గుజరాత్లో శిశువులను కొనుగోలు చేసి, హైదరాబాద్లో అమ్మినట్లు విచారణలో వెల్లడైంది.
అహ్మదాబాద్ పోలీసులు వారం క్రితం ఈ కేసుకు సంబంధించి నలుగురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. గత రెండేళ్లలో ఈ ముఠా దాదాపు 25 మంది శిశువులను హైదరాబాద్లో విక్రయించినట్లు అధికారులు నిర్ధారించారు. శిశువు చర్మవర్ణం, లింగాన్ని బట్టి ధరలను నిర్ణయిస్తూ అక్రమ వ్యాపారం సాగించినట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!