
సినిమాలు

శీతాకాల విరామం అనంతరం కేదార్నాథ్ ఆలయం ద్వారాలు భక్తులకు తిరిగి తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేశారు. చార్ ధామ్ యాత్ర ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
దీని తరువాత బద్రీనాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 23న తెరుచుకోనున్నాయి. ఇక గంగోత్రి ఆలయం, యమునోత్రి ఆలయం ద్వారాలు ఏప్రిల్ 19న భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు తరలివచ్చే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!