
గాసిప్స్

కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండా ముందుగానే వెళ్లిపోయాడన్న వార్తలతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రహంతో కొందరు ఫ్యాన్స్ స్టేడియంలోని సీట్లను ధ్వంసం చేయగా, గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అభిమానులు బారికేడ్లు దాటి మైదానంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అభిమానుల హంగామా కొనసాగడంతో మెస్సీ టీమ్‌ను సురక్షితంగా సొరంగ మార్గం ద్వారా బయటకు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో స్టేడియం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






.png&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!