
జనరల్

పొదుపు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు జిల్లా పర్యటనల్లో కాన్వాయ్ వాహనాలను 50 శాతం తగ్గించాలని సీఎం ఆదేశించారు.
ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌కు స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలు కూడా తక్కువ వాహనాలు వినియోగించాలని సూచించారు. రాబోయే కేబినెట్ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు చర్చించి ప్రకటిస్తామని సీఎం తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!