
జనరల్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా పర్యటనల్లో కూడా వాహన శ్రేణిని సగానికి తగ్గించాలని ఆయన నిర్ణయించారు. పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ సూచించిన పొదుపు స్ఫూర్తిని రాష్ట్రంలోనూ కొనసాగించాలని ఆయన భావించారు. ఈ చర్యలు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!