

ఎంసిఆర్ హెచ్ ఆర్ డి భోధి పెవిలియన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా గ్రోత్ కారిడార్ అభివృద్ధి ప్రణాళికపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. సిఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగర కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మలిన జల శుద్ధి కేంద్రాల రూపకల్పన, రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణం, భూగర్భ కాల్వ వ్యవస్థల్లో ఆధునిక సాంకేతికత వినియోగం చేయాలని ఆదేశించారు. ఖర్చు తగ్గించేందుకు విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని, ప్రతి మున్సిపాలిటీలో సౌర విద్యుత్ ఉత్పత్తి ఉండేలా చూడాలని పేర్కొన్నారు.
పట్టణాల అభివృద్ధి కోసం స్మార్ట్ సదుపాయాలు, వ్యర్థ నిర్వహణ కేంద్రాలు, రేడియల్ రోడ్లు, మల్టీ యుటిలిటీ టవర్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాబోయే 25 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, సింగరేణి పరిధిలోని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. టెంపుల్ మరియు టూరిజం కారిడార్ల అభివృద్ధికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!