
.jpg&w=3840&q=75)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ విషయంపై పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి లేఖ రాస్తూ పలు అంశాలపై స్పష్టత కోరారు.
ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎందుకు హాజరు కాలేదని కేంద్రం ప్రశ్నించింది. అలాగే రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌రూమ్‌లో నీళ్లు లేకపోవడం, రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే దారి చెత్తతో నిండిపోవడం వంటి విషయాలను కూడా ప్రస్తావించింది. డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగురి పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌పై ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలని కోరింది. ఈ వివరణను ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు ఇవ్వాలని కేంద్రం గడువు విధించింది. అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొనేందుకు బెంగాల్ వెళ్లిన రాష్ట్రపతికి జరిగిన ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!