
దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత పై వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండున్నర రోజుల్లోనే వినియోగదారులకు డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపింది. సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 25 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా మరింత మెరుగవుతుందని అధికారులు చెప్పారు. అలాగే అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి మార్గంలో సరఫరా సమస్యలు వచ్చినప్పటికీ, ఆ మార్గానికి సంబంధం లేని ఇతర మార్గాల ద్వారా చమురును దిగుమతి చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
హార్ముజ్ జలసంధి నుంచి ఆగిపోయిన సరఫరా కంటే ఇతర మార్గాల ద్వారా మరింత ఎక్కువ చమురును సేకరించినట్లు కేంద్రం తెలిపింది. దీంతో దేశంలో గ్యాస్ మరియు చమురు సరఫరాపై ఎలాంటి పెద్ద ప్రభావం ఉండదని ప్రభుత్వం పేర్కొంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!