
.jpg&w=3840&q=75)
బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్‌పై దైవాంశానికి సంబంధించిన పాత్రలను అవహేళన చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. కాంతారా సినిమాలోని పవిత్ర దైవ సన్నివేశాలను ఆయన కామెడీగా అనుకరించడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదు నమోదైంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏప్రిల్ 8 న కోర్టులో విచారణ జరగనుంది. 2025 లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాంతారా చిత్రంలో హీరో రిషబ్ శెట్టి పోషించిన పంజుర్లి, గులిగ వంటి దైవాంశ పాత్రలను రణ్ వీర్ సింగ్ కార్యక్రమంలో హాస్యంగా ఇమిటేట్ చేయడంతో కన్నడీగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన రణ్ వీర్ సింగ్ తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణ చెప్పారు. రిషబ్ శెట్టి ఆ పాత్రలను అద్భుతంగా పోషించారనే ప్రశంసలో భాగంగానే తాను అలా చేశానని వివరణ ఇచ్చారు. అయితే ఈ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది ప్రశాంత్ మితల్ గత డిసెంబరులో బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196, 299, 302 ప్రకారం కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!