
.jpg&w=3840&q=75)
కెనడా ప్రభుత్వం పౌరసత్వ నిబంధనలను మరింత సులభతరం చేస్తూ ముఖ్యమైన సవరణలను ఆమోదించింది. దీంతో విదేశాల్లో పుట్టిన కెనేడియన్ పౌరులు, ముఖ్యంగా భారత సంతతికి చెందిన కుటుంబాలకు, దీర్ఘకాలంగా ఎదురవుతున్న పౌరసత్వ సమస్యలు పరిష్కార దిశగా కదులుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోర్టు తీర్పుల తర్వాత పౌరసత్వంపై ఉన్న కీలక పరిమితులను తొలగించేందుకు బిల్ C-3 పేరుతో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం అమల్లోకి రాగానే విదేశాల్లో జన్మించిన వారు తమ పిల్లలకు పౌరసత్వాన్ని బదిలీ చేసే అవకాశం లభిస్తుంది.
కానీ దీనికి ఒక ప్రధాన షరతు ఉంది:
వారి బిడ్డ పుట్టకముందు కనీసం 1075 రోజులు కెనడాలో నివసించినట్టు రుజువు చేయాలి. ఈ నియమం దత్తత తీసుకున్న పిల్లలకూ వర్తిస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి, కెనడా కూడా ఇదే దిశగా ముందడుగు వేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సవరణలు అమల్లోకి వస్తే విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వేలాది కుటుంబాలకు ఇది పెద్ద ఊరట కలిగిస్తుందని వలస నిపుణులు చెబుతున్నారు.








.jpeg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!