
న్యూస్

ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం అనే మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా, ప్రస్తుత అన్నమయ్య జిల్లా పరిధిలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాలో చేర్చడం, రాజంపేటను కడప జిల్లాకు మార్చడం, అలాగే రైల్వేకోడూరును తిరుపతి జిల్లా పరిధిలోకి తీసుకురావడం వంటి ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ పునర్విభజనతో పరిపాలన మరింత సులభతరం అవుతుందని, ప్రజలకు సేవలు వేగంగా అందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!