
గాసిప్స్

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. నార్త్ కరోలినా లోని స్టేట్స్ విల్లే రీజనల్ ఎయిర్ పోర్టులో సెసనా C550 బిజినెస్ జెట్ ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలింది. ప్రమాదం వెంటనే జెట్ నుండి భారీగా మంటలు ఎగసిపోవడం వల్ల తీవ్ర స్థాయిలో మృతులు సంభవించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఇప్పటి వరకు ఖచ్చితంగా ఎంతమంది మృతి చెందారనే వివరాలు ఇంకా స్పష్టత లేదు.
ఈ ప్రమాదం కారణంగా ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా జెట్ క్రాష్ అవ్వడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!