
సినిమాలు

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్కు కాంగ్రెస్ కార్యకర్తలు అంతరాయం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు శనివారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పార్టీ మద్దతుదారులు, యువజన విభాగం సభ్యులు ఢిల్లీ, సూరత్, ములుండ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి నల్లజెండాలతో ఆందోళనలు నిర్వహించారు.
మహారాష్ట్రలోని ములుండ్లో రాహుల్ గాంధీకి నిరసనల సెగ తగిలింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన పరువునష్టం కేసులో పూచీకత్తు ఇచ్చేందుకు ఆయన థానే వెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించారు. ‘లష్కరే రాహుల్’ అంటూ నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!