
గాసిప్స్

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర సోమవారం తిరుపతి చేరుకుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జనవరి 19 న హైదరాబాద్కు సమీపంలోని షాద్నగర్ నుంచి తన యాత్రను ప్రారంభించానని బండ్ల గణేష్ తెలిపారు. దాదాపు 507 కిలోమీటర్లు నడిచి తిరుపతి చేరుకోవడం తనకు ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.
మంగళవారం అలిపిరి నుంచి తిరుమల కు పాదయాత్రగా చేరుకుని స్వామివారికి మొక్కులు చెల్లించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ యాత్రలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!