
గాసిప్స్

అరబిందో గ్రూప్‌కు చెందిన రియాల్టీ సంస్థ అరో రియాల్టీ, హైదరాబాద్‌లో మరో ప్రముఖ ఆస్తిని సొంతం చేసుకుంది. బంజారా హిల్స్‌లో ఉన్న తాజ్ బంజారా స్టార్ హోటల్‌ను ఈ సంస్థ సుమారు రూ.315 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ హోటల్ 16,645 చదరపు గజాల విస్తీర్ణంలో, సుమారు 1.2 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో నిర్మించబడింది. జీహెచ్ఎంసీకి పన్నులు చెల్లించకపోవడంతో గత కొన్ని రోజులుగా ఇది మూసివేసి ఉంది.
తాజ్ బంజారాను అరో రియాల్టీ పునర్నిర్మాణం చేసి మళ్లీ స్టార్ హోటల్‌గా నిర్వహిస్తుందా, లేక రియాల్టీ ప్రాజెక్టుగా మారుస్తుందా అన్న విషయం పై సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!