

ఇరాన్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో సుప్రీం నాయకుడు ఖమేనీ నివాస ప్రాంగణం వైమానిక దాడుల్లో నేలమట్టమైనట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రకటించారు. శనివారం ఉదయం ఖమేనీ ప్రాంగణంపై సుమారు 30 బాంబులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ‘‘ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆ నిరంకుశుడు జీవించి ఉండకపోవచ్చు’’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
అయితే ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని, దేశానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళం స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమం ‘ట్రూత్’లో పోస్ట్ చేస్తూ ఖమేనీ మరణించినట్లు పేర్కొన్నారు. ఇరాన్‌పై భారీ బాంబు దాడులు కొనసాగుతాయని, ఇవి వారం రోజులకంటే ఎక్కువ కాలం సాగవచ్చని ఆయన తెలిపారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!