

సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అభ్యర్థులను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు దగ్గరైన రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌ను విరుగంబక్కం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఈ విషయం విన్న శబరినాథన్ భావోద్వేగానికి లోనై విజయ్ కాళ్లు మొక్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాజేంద్రన్ కూడా భావోద్వేగానికి లోనవగా, విజయ్ తండ్రీకొడుకులను హత్తుకుని ఓదార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మొత్తం 234 నియోజకవర్గాలకు టీవీకే అభ్యర్థులను ప్రకటించిన విజయ్, పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన ఇప్పటికే చెప్పారు. ముఖ్యంగా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువతలో ఈ పార్టీకి మంచి ఆదరణ కనిపిస్తోంది. చెన్నై, మదురై, తిరుప్పూర్ వంటి నగరాల్లో టీవీకే బలంగా ఎదుగుతోందని చెబుతున్నారు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా మారే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!