
క్రీడలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే, రాజ్యాంగ నిపుణుల ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త సీఎం ప్రమాణం చేసే వరకు ఆమె పదవిలో కొనసాగవచ్చు. అయితే, రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ల కాలం పూర్తైన తర్వాత పాత ప్రభుత్వం కొనసాగడం సాధ్యం కాదు. అందువల్ల నిర్ణీత గడువులో కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిందే.
ఈ పరిస్థితిలో గవర్నర్ కీలక పాత్ర పోషిస్తారు. సీఎం రాజీనామా చేయకపోతే లేదా సభలో మెజారిటీ నిరూపించలేకపోతే, గవర్నర్ ప్రభుత్వం రద్దు చేసే అధికారం కలిగి ఉంటారు. అవసరమైతే బలనిరూపణ కోరవచ్చు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారు. మొత్తం ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ తటస్థంగా వ్యవహరిస్తారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!