
క్రీడలు

ఎన్నికల్లో ఓటమి అనంతరం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన నియోజకవర్గం కొళత్తూరులో పర్యటించి ప్రజలను కలిశారు. గత 15 ఏళ్లుగా తనకు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పలు వీధుల్లో తిరిగారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ‘ఎక్స్’లో షేర్ చేశారు.
కొళత్తూర్‌తో తనకు ఉన్న అనుబంధం గెలుపోటములకు అతీతమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు, అధికారంలో 5 సంవత్సరాలు పనిచేస్తూ అభివృద్ధి పనులను అమలు చేశానని తెలిపారు. పార్కులు, క్రీడా మైదానాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి మౌలిక వసతులను కల్పించానని పేర్కొంటూ, ప్రజల సమస్యలను పరిష్కరించడం తనకు గర్వంగా ఉందని, ఎప్పుడూ ప్రజలతో ఉంటానని హామీ ఇచ్చారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!