
క్రీడలు

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ప్రారంభమై, అనంతరం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా వరుసగా రెండు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయాలతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ 275 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ (262), ఆస్ట్రేలియా (258) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తాజా అప్‌డేట్ ప్రకారం మే 2025 తర్వాత మ్యాచ్‌లకు పూర్తి వెయిటేజీ, అంతకుముందు రెండేళ్ల మ్యాచ్‌లకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. 2024 నుంచి 2026 వరల్డ్ కప్‌ల మధ్య భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లలో అజేయంగా నిలిచింది. టాప్-7 జట్లలో మార్పుల్లేకపోయినా, బంగ్లాదేశ్ 8వ స్థానానికి చేరగా, శ్రీలంక 9వ స్థానానికి పడిపోయింది. యూఎస్ఏ, ఇటలీ వంటి జట్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!