
సినిమాలు

యాపిల్ తన నాయకత్వంలో భారీ మార్పులను ప్రకటించింది. దాదాపు 15 ఏళ్లుగా సీఈవోగా ఉన్న టిమ్ కుక్ ఆ పదవి నుంచి తప్పుకుని ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జాన్ టర్నెస్ను కొత్త సీఈవోగా నియమిస్తూ, సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ మార్పులతో ఎన్విడియాతో పోటీకి యాపిల్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా హార్డ్‌వేర్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై దృష్టి పెంచుతోంది. జానీ స్రౌజీను చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్‌గా నియమించగా, టర్నెస్ స్థానంలో టామ్ మెరీబ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మ్యాక్, ఐపాడ్, ఎయిర్‌పాడ్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన టర్నెస్ నాయకత్వంలో యాపిల్ మరింత సాంకేతిక పురోగతిని సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి.



.jpeg&w=3840&q=75)












.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!