
ఆరోగ్యం

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ ఒక సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది. దేశంలో కోటి కోర్సుల దరఖాస్తులు పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ గొప్ప విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకున్నారు.
ఈ పోర్టల్‌లో కోటికి పైగా ఎన్రోల్మెంట్లు నమోదు కాగా, 80 లక్షలకు పైగా కోర్సులు విజయవంతంగా పూర్తయ్యాయి. మొత్తం 4,290 కోర్సుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు నైపుణ్యాభివృద్ధి పొందారని సీఎం వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగుల నిరంతర అభ్యాసం పట్ల ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS) ఆధ్వర్యంలో ఈ కర్మయోగి కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతోందని, నైపుణ్యంతో కూడిన భవిష్యత్తు వైపు రాష్ట్రం అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!