

రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన భవన నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. పురపాలక శాఖ మంత్రి నారాయణ రాఫ్ట్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి హైకోర్టు నిర్మాణానికి పూజలు చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏపీ హైకోర్టు భవనాన్ని 2027 చివరినాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
మంత్రి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం, హైకోర్టు భవనం B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ నిర్మాణంగా రూపుదిద్దుకోనుంది. రెండు అంతస్తుల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో ఏడు అంతస్తులు ఉండనున్నాయి. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో 52 కోర్టు హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 2వ, 4వ, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉండగా, 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఏర్పాటు చేయనున్నారు.
హైకోర్టు భవన నిర్మాణానికి సుమారు 45 వేల టన్నుల స్టీల్ వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థకు గౌరవం తీసుకొచ్చేలా, ఆధునిక వసతులతో కూడిన హైకోర్టు భవనాన్ని నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!