.webp&w=3840&q=75)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చేనేత వర్గానికి చారిత్రాత్మక భరోసా కల్పించే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి N.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తీసుకుంది. రేపటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. లక్షలాది మంది చేనేత కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్‌లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి చేనేత వృత్తికి మరింత మద్దతు ఇవ్వడం ఈ నిర్ణయ లక్ష్యంగా ఉంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93,000 మగ్గాల కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏడాదికి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రాయితీ వల్ల ఒక్కో చేనేత కార్మిక కుటుంబానికి ఏడాదికి సుమారు రూ.8,640 వరకు, అలాగే పవర్ లూమ్ యూనిట్లకు సంవత్సరానికి రూ.21,600 వరకు ఆర్థిక ఉపశమనం లభించనుంది.
నేత వృత్తిలో విద్యుత్ ఒక కీలకమైన ఖర్చుగా మారిన నేపథ్యంలో, మగ్గాల నిర్వహణ, అల్లిక, డైయింగ్ వంటి పనులకు అవసరమైన విద్యుత్ భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పథకం చేనేత రంగానికి బలాన్ని చేకూర్చి, నేతన్నల జీవనోపాధికి వెన్నెముకగా నిలుస్తుందని భావిస్తున్నారు.

.webp&w=3840&q=75)








.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!