.webp&w=3840&q=75)

‘మా ఇంటి బంగారం’ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
నిన్నటి నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా “మా బంగారం డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది” అంటూ సమంత డబ్బింగ్ చేస్తున్న ఫొటోను టీమ్ సోషల్ మీడియాలో పంచుకుంది. అలాగే తన ఫేవరెట్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నానని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపొందుతుండగా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సమంత లుక్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ‘ఓ బేబీ’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో మరింత అంచనాలను రేకెత్తిస్తోంది.








.webp&w=3840&q=75)

.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!