
న్యూస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై సీఐడీ విచారణకు ఆదేశించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ సహా అనేక సంస్థలపై విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. సంబంధిత ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
గంగుల, వద్దిరాజు వంటి నాయకులతో సంబంధం ఉన్న మైనింగ్‌పై కూడా విచారణ జరుపుతామని చెప్పారు. అలాగే సిరిసిల్లలోని ఇసుక మాఫియాపైనా విచారణ చేస్తామని పేర్కొన్నారు. జూన్ 2 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన అన్ని మైనింగ్ లీజులపై సమగ్రంగా పరిశీలించి, ఆ నివేదికలను వచ్చే అసెంబ్లీలో సమర్పిస్తామని తెలిపారు.
అక్రమ మైనింగ్‌కు హరీష్, కేటీఆర్ నాయకత్వం వహించారని సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల బ్లాక్మెయిల్లకు తాము భయపడమని ఆయన స్పష్టం చేశారు. సీఐడీ విచారణతో నిజాలు బయటపడతాయని ఆయన తెలిపారు.





.webp&w=3840&q=75)













.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!