
న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాల ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఖాళీల వివరాలను క్షేత్రస్థాయి నుంచి సేకరించింది.
ప్రాథమిక అంచనాల ప్రకారం అన్ని రకాల పోస్టులు కలిపి సుమారు 3,600 వరకు ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉంది. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థలు, సంక్షేమ శాఖకు చెందిన పాఠశాలల నుంచి ఖాళీల వివరాలు తీసుకున్నారు. ఈ నియామక ప్రక్రియ రాష్ట్రంలోని ఉపాధ్యాయ అభ్యర్థులకు కీలక అవకాశంగా భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!