

బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, యువ నటుడు చంద్రహాస్‌పై మరో క్రిమినల్ కేసు నమోదైంది. బరాబర్ ప్రేమిస్తా సినిమా ఆడియో విడుదల వేడుకలో ఆయన పాడిన “గుంజీ గుంజీ” పాట తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆ కార్యక్రమంలో చంద్రహాస్ అసభ్య పదజాలం ఉపయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు కాగా, తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రహాస్ అభ్యంతరకర భాషతో పాట పాడినట్లు కానిస్టేబుల్ నితీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం చంద్రహాస్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన బరాబర్ ప్రేమిస్తా చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!