
టెక్నాలజీ

2047 నాటికి ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ను తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రజలతో ఈ శుభ సందర్భంగా భాగస్వామ్యం కావడం గర్వకారణమని ఆయన తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని, ప్రభుత్వ సంస్థలు మళ్లీ బలపడుతున్నాయని గవర్నర్ అన్నారు. ప్రజల విశ్వాసం తిరిగి స్థాపితమవుతోందని పేర్కొన్నారు. ఐక్యతతో ముందుకు సాగితే ఆరోగ్యవంతమైన, ఆనందభరితమైన, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించవచ్చని చెప్పారు. 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో నిలిపే దిశగా అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!