
.png&w=3840&q=75)
యాంకర్ శివజ్యోతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసాదంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఆమె, “తిరుపతిలో ఖరీదైన ప్రసాదం అడుగుతారు… అక్కడ రిచెస్ట్ బిచ్చగాళ్లం” అంటూ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు భక్తుల కోపానికి గురయ్యాయి.
శివజ్యోతి మాట్లాడిన తీరు, పవిత్రమైన ప్రసాదాన్ని “అడుక్కోవడం” అని అభివర్ణించడం హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. స్వామి వారికి సంబంధించిన ప్రసాదం ఉచితంగా భక్తులకు ఇవ్వబడుతుందని, దానిని తేలిగ్గా తీసుకుని ఇలా జోకులాగా మాట్లాడడం హిందూ భావాలను దెబ్బతీసిందని భక్తులు పేర్కొంటున్నారు.
ఇది ధార్మిక భావాలను అవమానించే చర్య అని తెలిపారు. శివజ్యోతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమెపై విమర్శల తుఫాన్ కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!