

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశ తాత్కాలిక సారథి యూనస్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన పాలన వల్ల ఒకప్పుడు శాంతియుతంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు హింస, భయం, అస్తవ్యస్త పరిస్థితుల్లోకి జారిపోయిందని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన దక్షిణాసియా ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, దేశంలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని అన్నారు.
గతేడాది ఆగస్టులో జరిగిన కుట్ర తర్వాత దేశవ్యాప్తంగా అణచివేత పెరిగిందని, స్వేచ్ఛ కనుమరుగైందని హసీనా పేర్కొన్నారు. సంస్థలు బలహీనపడ్డాయని, మతతత్వ శక్తులు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. మహిళలపై హింస, లైంగిక వేధింపులు తీవ్రంగా పెరిగాయని, దేశం భయంతో నిండిపోయిందన్నారు. ఈ సంక్షోభ సమయంలో రాజ్యాంగాన్ని కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, హింసాత్మక పాలనకు ముగింపు పలకడం కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!