

టాలీవుడ్లో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసు మరోసారి చర్చనీయాంశమైంది. 2002 లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 24 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వబోతోంది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. శిక్షను రద్దు చేయాలని లేదా తగ్గించాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేశాడు.
దీనికి ప్రతిగా ప్రత్యూష తల్లి సరోజినీ కూడా పిటిషన్లు సమర్పించారు. నిందితుడికి విధించిన శిక్ష సరిపోదని, శిక్షను పెంచాలని కోరుతూ గత సంవత్సరం నవంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ల పై విచారణ పూర్తి చేసిన కోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది.
ఇప్పటికే రెండు దశాబ్దాలకు పైగా గడిచిన ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. నిందితుడి శిక్షను కొనసాగిస్తుందా, తగ్గిస్తుందా లేదా మరింత కఠినతరం చేస్తుందా అనే అంశంపై చర్చ సాగుతోంది.
నటి ప్రత్యూష తన కెరీర్లో మంచి అవకాశాలు అందుకుంటూ ఉన్న సమయంలోనే ఈ విషాద ఘటన జరిగింది. 2002 ఫిబ్రవరి 23 న ప్రత్యూష మరియు ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు సేవించారు. ఈ ఘటనలో ప్రత్యూష చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే సిద్ధార్థ రెడ్డి కోలుకున్నారు.
ఈ ఘటన అనంతరం ప్రత్యూష తల్లి సరోజినీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. తదనంతరం విచారణ కొనసాగి, హైకోర్టు శిక్ష విధించింది. ఇప్పుడు ఆ శిక్ష పై సుప్రీంకోర్టు తుది నిర్ణయం వెలువరించబోతోంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!